Kalki 2
ఆకేరు న్యూస్, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. భవిష్యత్ నేపథ్యంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడంతో పాటు జాతీయ అవార్డుల్లోనూ సత్తా చాటింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న ‘కల్కి 2’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అక్టోబర్‌లో షూటింగ్
‘కల్కి 2’ రెగ్యులర్ షూటింగ్‌ను అక్టోబర్‌లో ప్రారంభించేందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. 2027 మధ్య నాటికి చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేసేలా నాగ్ అశ్విన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
భారీ తారాగణం
సీక్వెల్లో ప్రభాస్‌తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తదితర ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షూటింగ్ ప్రారంభమైన తర్వాత మరికొందరు ప్రముఖ నటీనటులు కూడా చిత్ర బృందంలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరింత గ్రాండియర్‌గా..
‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా రూ.1,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన నేపథ్యంలో ‘కల్కి 2’పై అంచనాలు మరింత పెరిగాయి. తొలి భాగాన్ని మించేలా భారీ యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్‌తో సీక్వెల్‌ను మరింత గ్రాండియర్‌గా తెరకెక్కించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ అభిమానులతో పాటు పాన్ ఇండియా సినీ ప్రేక్షకులు ‘కల్కి 2’ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
