BHEL Hyderabad
BHEL Hyderabad| ఆకేరు న్యూస్, హైదరాబాద్: భారత భారీ విద్యుత్ పరికరాల సంస్థ (బీహెచ్ఈఎల్) హైదరాబాద్ (రామచంద్రాపురం) యూనిట్ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా జి. సుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహించిన వై. శ్రీనివాసరావు పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో సుబ్రహ్మణ్యంను నియమిస్తూ బీహెచ్ఈఎల్ కార్పొరేట్ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.
1989లో బీహెచ్ఈఎల్లో చేరిక
జి. సుబ్రహ్మణ్యం 1989లో ఇంజనీర్ ట్రైనీగా బీహెచ్ఈఎల్లో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. సంస్థలోని వివిధ విభాగాల్లో పనిచేస్తూ అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగారు. గతంలో రామచంద్రాపురం యూనిట్లో టర్బైన్, కంప్రెషర్స్ విభాగంలో జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. అనంతరం పదోన్నతిపై విశాఖపట్నం యూనిట్ ఈడీగా బాధ్యతలు నిర్వహించారు.
విస్తృత అనుభవం
సాంకేతికత, తయారీ, ఉత్పత్తి, పరిపాలనా రంగాల్లో సుబ్రహ్మణ్యానికి విస్తృత అనుభవం ఉంది. హైదరాబాద్ యూనిట్ కార్యకలాపాలపై ఆయనకు ఉన్న అవగాహన, గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని రామచంద్రాపురం యూనిట్ ఈడీగా నియమించినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. కొత్త బాధ్యతలు స్వీకరించిన సుబ్రహ్మణ్యానికి ఉన్నతాధికారులు, కార్మిక సంఘాలు, అసోసియేషన్ల ప్రతినిధులు స్వాగతం పలికి సత్కరించారు.
మాజీ ఈడీకి ఘన వీడ్కోలు
మాజీ ఈడీ వై. శ్రీనివాసరావు పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు, కార్మిక సంఘాలు, అసోసియేషన్ల ప్రతినిధులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. బీహెచ్ఈఎల్ హైదరాబాద్ యూనిట్ అనేక రంగాల్లో ప్రతిభ చాటుతూ అపార సామర్థ్యం కలిగిన బహుముఖ సంస్థగా ఎదిగిందన్నారు. భవిష్యత్‌లో నూతన ఉత్పత్తులు, సాంకేతికతలు, కొత్త వ్యాపార అవకాశాలతో హైదరాబాద్ యూనిట్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగులంతా ఐక్యత, అంకితభావం, నిబద్ధతతో పనిచేసి సంస్థను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
