Panduga Srinivas Naspur SC Cell
*ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును కలిసిన నూతన అధ్యక్షుడు
ఆకేరు న్యూస్, మంచిర్యాల : మంచిర్యాల నియోజకవర్గం నస్పూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన పండుగ శ్రీనివాస్.. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు.
నూతన బాధ్యతలు స్వీకరించిన అనంతరం పండుగ శ్రీనివాస్ వారిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ పండుగ శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
* ఎమ్మెల్యేకు, సురేఖకు కృతజ్ఞతలు..
తనపై నమ్మకం ఉంచి నస్పూర్ పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నియమించినందుకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖకు పండుగ శ్రీనివాస్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు. నస్పూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు.
*నాయకులు, కార్యకర్తల అభినందనలు..
పండుగ శ్రీనివాస్‌కు నూతన బాధ్యతలు దక్కడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేయాలని పలువురు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడు, కార్పొరేటర్ ఖలీద్, మంచిర్యాల జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు పూదరి తిరుపతి, జిల్లా ఓబీసీ చైర్మన్ వొడ్డే రాజమౌళి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
