* షూటర్‌గా పాల్గొననున్న బిహర్ శాసనసభ్యురాలు శ్రేయసి సింగ్
ఆకేరు న్యూస్ డెస్క్ : పారిస్‌లో ఒలింపిక్స్ (Paris Olympics) వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచ దేశాల నుంచి క్రీడాకారులు, తారలు ఆ వేడుకల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Tollywood Megastar Chiranjeevi) కూడా కుటుంబ సమేతంగా పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన నిన్న జరిగిన పారిస్ ఒలింపిక్ ఓపెనింగ్ వేడుకల్లో సందడి చేశారు. అంతేకాదు, చిరంజీవి ఒలింపిక్ జ్యోతి (ఒలింపిక్ టార్చ్ రెప్లికా) ప్రతిరూపాన్ని చేతబూనారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇదిలా ఉండగా.. ఒలింపిక్ క్రీడాపోటీలకు భారతదేశం తరుపున 117 మంది క్రీడాకారులు పాల్గొంటుండగా వారిలో బిహార్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. బిహర్ (Bihar) లోని జముయ్ ఎమ్మెల్యే (Jamui MLA) శ్రేయసి సింగ్ (Shreyasi Singh) షూటింగ్ క్రీడాకారిణి కూడా. అర్జున అవార్డు గ్రహీత. డబుల్ ట్రాప్ విభాగంలో 2024లో గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ల్లో రజత పతాకాన్ని, 2018లో గోల్డ్‌కోస్ట్ జరిగిన పోటీల్లో బంగారు పతకాన్ని సాధించారు. 2020లో జరిగిన బీహర్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేపై 41 వేల ఓట్ల మెజారీటితో గెలిచారు. ఆమె బిహార్ మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్ కుమారై. తల్లి పుతుల్ సింగ్ బంకా నియోజకవర్గ ఎంపీ. తల్లిదండ్రులిద్దరూ రాజకీయాల్లో రాణించడంతో తనూ ఆ దిశగా అడుగులు వేశారు. తాత, తండ్రి ఇద్దరు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ కి అధ్యక్షులుగా వ్యవహిరించడంతో ఆమె షూటింగ్ కెరీర్ వైపు అడుగులు వేశారు.
———————-