Rajanna Sircilla
* సెప్టెంబర్ 30 వరకు అవకాశం..
* మూడు ప్రాంతాలపై రీల్స్
Rajanna Sircilla| ఆకేరు న్యూస్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని పర్యాటక, చారిత్రక ప్రాంతాలను దేశ, విదేశీ పర్యాటకులకు పరిచయం చేసే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ‘ఉత్తమ రీల్స్, వ్యూస్ పోటీ’ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.
మూడు ప్రాంతాలపై రీల్స్
పోటీలో భాగంగా వెంకటాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్, వేములవాడ గుడి చెరువు వద్ద VTADA బండ్ పార్క్, నాంపల్లి గుట్ట ప్రాంతాలపై రీల్స్ రూపొందించాలి. ఆయా ప్రాంతాల ప్రకృతి అందాలు, పచ్చదనం, అటవీ సంపద, మౌలిక వసతులు, చారిత్రక ప్రాధాన్యాన్ని ఆకట్టుకునేలా వీడియోల్లో చూపించాలని అధికారులు సూచించారు.
విజేతలకు నగదు బహుమతులు
రీల్స్‌కు వచ్చే వ్యూస్‌తో పాటు కంటెంట్‌లోని సృజనాత్మకతను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు.
మొదటి బహుమతి: రూ.15,000
రెండో బహుమతి: రూ.10,000
మూడో బహుమతి: రూ.5,000
సెప్టెంబర్ 30 చివరి తేదీ
రీల్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అనంతరం దాని లింక్‌ను 9440239783 వాట్సాప్ నంబర్‌కు పంపాలి. సెప్టెంబర్ 30లోగా లింక్ పంపాల్సి ఉంటుంది. యువత, రీల్స్ క్రియేటర్స్, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
