నాటు సారాయి ధ్వంసం చేస్తున్న సూర్యాపేట పోలీసులు
* 8 లీటర్ల నాటు సారాయి స్వాధీనం
* 105 లీటర్ల తయారీ పానకం, పరికరాలు ధ్వంసం
ఆకేరు న్యూస్, సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో (Suryapet Natu Saraayi) నాటు సారాయి తయారీ, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమంగా నాటు సారాయి తయారు చేస్తున్న వారిని గుర్తించి కట్టడి చేసేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు (Suryapet Police Raids) చేపట్టారు.
జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు (Suryapet Police Raids), స్థానిక పోలీస్ స్టేషన్ల సిబ్బంది సంయుక్త బృందాలుగా ఏర్పడి పలు గ్రామాల్లో ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన నాటు సారాయితో పాటు దాని తయారీకి ఉపయోగించే ముడిసరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం 8 లీటర్ల నాటు సారాయిని పట్టుకున్నారు. అలాగే నాటు సారాయి తయారీకి ఉపయోగిస్తున్న 15 కిలోల బెల్లం, 3 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా సుమారు 105 లీటర్ల సారాయి తయారీకి సిద్ధంగా ఉంచిన పానకాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. తయారీకి ఉపయోగిస్తున్న పరికరాలను సైతం పోలీసులు ధ్వంసం చేశారు.
* ఏడు కేసులు నమోదు..
జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రత్యేక తనిఖీల్లో నాటు సారాయి తయారీ, విక్రయాలకు సంబంధించి మొత్తం ఏడు కేసులు నమోదు చేసినట్లు జిల్లా పోలీస్ శాఖ వెల్లడించింది. అక్రమంగా నాటు సారాయి తయారు చేయడం, విక్రయించడం వల్ల ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
* ప్రజలు సహకరించాలని విజ్జప్తి..
నాటు సారాయి తయారీ కేంద్రాలు, అక్రమ విక్రయాలపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని జిల్లా పోలీస్ శాఖ తెలిపింది. ప్రజలు తమ పరిసరాల్లో ఎక్కడైనా నాటు సారాయి తయారీ లేదా విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరింది.
సమాచారం అందించేందుకు డయల్ 112కు లేదా సూర్యాపేట జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్లు 8712686026, 8712686057కు ఫోన్ చేయాలని సూచించింది. అక్రమ మద్యం తయారీ, విక్రయాల నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

