Konda Laxman Bapuji Jayanti
Konda Laxman Bapuji Jayanti: ఆకేరు న్యూస్, ములుగు: తెలంగాణ ఉద్యమ నేత, స్వాతంత్ర్య సమరయోధుడు, పద్మశాలి సమాజ ప్రముఖుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ములుగు జిల్లా సంక్షేమ భవన్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి బి. రామ్మోహన్ మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన సేవలను, తెలంగాణ ఉద్యమంలో పోషించిన కీలక పాత్రను, వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి చేసిన కృషిని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు చిప్ప అశోక్, జిల్లా గౌరవ అధ్యక్షులు డి.పి. జనార్ధన్, జిల్లా కన్వీనర్ గుర్రపు శ్రీధర్, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి జిల్లా అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్వరపు వేణుగోపాల్, చేనేత సహకార సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు కందగట్ల సారయ్య, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బాసని రామూర్తి, ముంజాల బిక్షపతి, స్వాతంత్ర్య సమరయోధుడు చిందం రాయమల్లు, బీసీ సంక్షేమ శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
