Huzurabad Crime
Published:
Updated: 28 Sep 2026 • 12:15 PM
*యువకుడిని కత్తితో పొడిచి హత్య
ఆకేరు న్యూస్, హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం (Huzurabad Crime) పెద్దపాపయ్యపల్లి గ్రామ ఎస్సారెస్పీ కాలువ సమీపంలో ఒక యువకుడు ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు.
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన వడిగే రాకేశ్ (32)ను అదే గ్రామానికి చెందిన అంబరగొండ ప్రశాంత్ కత్తితో పొడిచి చంపినట్లు తెలుస్తోంది.
హత్య అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ప్రచారం జరుగుతుండగా, పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
