Danam Nagender
* ఉపఎన్నికలో దిమ్మతిరిగే ఫలితాలొస్తాయి
* సీఈసీ వెంటనే రాజీనామా చేయాలి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఖైరతాబాద్ నియోజకవర్గంలో రాబోయే ఉపఎన్నికపై ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) కీలక వ్యాఖ్యలు చేశారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, ఖైరతాబాద్‌లో తనపై ఎలాంటి ప్రభావం ఉండదని, ఉపఎన్నికల్లో తమ సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు.
* ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో..
ఉపఎన్నికల్లో దిమ్మతిరిగే ఫలితాలు వస్తాయని వ్యాఖ్యానించిన దానం నాగేందర్, “ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో.. అలా ఉంటుంది” అంటూ ప్రత్యర్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు తమదేనన్న నమ్మకాన్ని ఆయన వెల్లడించారు.
* కిషన్ రెడ్డి గెలుపు ఓటు చోరీతోనే..
ఇదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం (ECI), భారతీయ జనతా పార్టీ (BJP)లపై దానం నాగేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకుని ఓటు చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఓటు చోరీ చేయడం వల్లే గెలిచారని, లేకపోతే ఆయన గెలిచేవారే కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
* సీఈసీ రాజీనామా చేయాలి..
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని దానం నాగేందర్ డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేయకపోతే సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసుకుని జ్ఞానేష్ కుమార్‌ను బాధ్యతల నుంచి తొలగించాలని కోరారు.
ఇటీవలే దానం నాగేందర్ (Danam Nagender) అనర్హత అంశంలో సుప్రీంకోర్టు తీర్పుతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక ఖాయమవ్వడంతో, ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
