డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు (ఫైల్ ఫోటో)
* వీకెండ్లో భారీ తనిఖీలు
* రెండు రోజుల్లో 545 కేసులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్లో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ట్రాఫిక్ పోలీసులు (Hyderabad Drunk and Drive) కఠిన చర్యలు చేపట్టారు. వీకెండ్ సందర్భంగా నవంబర్ 13, 14 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ తనిఖీల్లో మొత్తం 545 మంది వాహనదారులు పట్టుబడ్డారు.
* 239 మందిలో అధిక ఆల్కహాల్ స్థాయి..
పోలీసులు నమోదు చేసిన మొత్తం 545 కేసుల్లో 459 మంది ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. మిగిలిన 86 కేసులు ఇతర వాహనదారులకు సంబంధించినవి. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిలో అత్యధికంగా బైక్ రైడర్లే ఉండటం గమనార్హం.
తనిఖీల్లో పట్టుబడిన వారిలో 239 మంది రక్తంలో ఆల్కహాల్ స్థాయి (BAC) 51 నుంచి 100 mg/100 ml మధ్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరికొందరిలో అంతకంటే ఎక్కువ స్థాయిలో ఆల్కహాల్ ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైంది.
మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరం. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 185 ప్రకారం రక్తంలో ఆల్కహాల్ స్థాయి అనుమతించిన పరిమితిని మించితే జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.
మొదటిసారి పట్టుబడితే గరిష్ఠంగా ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.10 వేల జరిమానా లేదా రెండూ విధించవచ్చు. రెండోసారి పట్టుబడితే గరిష్ఠంగా రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ.15 వేల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
* వాహనదారులకు పోలీసుల హెచ్చరిక
మద్యం సేవించిన తర్వాత వాహనాలు నడపవద్దని పోలీసులు వాహనదారులకు సూచిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ (Hyderabad Drunk and Drive) వల్ల వాహనం నడిపే వ్యక్తితో పాటు రోడ్డుపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
వీకెండ్లు, పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో తనిఖీలు మరింత విస్తృతంగా నిర్వహించే అవకాశం ఉంది. మద్యం సేవించి డ్రైవింగ్ చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజల భద్రతకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

