Indiramma Housing Scheme
* ఒంటిపై పెట్రోల్ పోసుకున్న వ్యక్తి
ఆకేరు న్యూస్, జనగామ : జనగామ జిల్లాలో ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన ఘటన జనగామ మండలం ఎల్లంగాల గ్రామంలో చోటుచేసుకుంది.
ఎల్లంగాల గ్రామానికి చెందిన బిర్రు రాజు అనే వ్యక్తి.. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్థులు నీళ్లు పోసి రాజును కాపాడారు. ఈ ఘటనతో గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఇదిలా ఉండగా.. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేయాలని, స్థానికంగా నివసిస్తున్న అర్హులకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
లబ్ధిదారుల ఎంపికను గ్రామ సభ ద్వారా పారదర్శకంగా చేపట్టాలని, ఎంపిక ప్రక్రియలో రాజకీయ ప్రమేయం ఉండకూడదని కోరుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరులో జాప్యం జరుగుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
