Pothugallu
అకేరు న్యూస్, జయశంకర్ భూపాలపల్లి : మొగుళ్లపల్లి మండలం పోతుగల్లు గ్రామంలో ఇసుక లోడింగ్ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. నెల రోజులుగా కొనసాగుతున్న సమస్య సోమవారం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసినట్లు సమాచారం. పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న చిట్యాల సీఐ సతీష్, స్థానిక ఎస్సై సురేష్ పోలీసు సిబ్బందితో గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల అధికారులు కూడా గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించినట్లు తెలుస్తోంది.
ఘర్షణకు దారితీసిన కారణాలు, గాయపడిన వారి సంఖ్య, కేసుల నమోదు తదితర వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం గ్రామంలో పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
