కిషన్ రెడ్డికి వినతిపత్రం ఇస్తున్న చిరంజీవి
* డీప్‌ఫేక్‌ల నియంత్రణకు కఠిన చర్యలు
ఆకేరు న్యూస్, డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ డీప్‌ఫేక్ వీడియోలు, చిత్రాలు రూపొందించడంపై మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా చర్యలను అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి చిరంజీవి వినతి చేసినట్లు తెలిపారు.
* కిషన్‌రెడ్డికి మెగాస్టార్ వినతి
ఏఐ సాంకేతికతను ఉపయోగించి వ్యక్తుల గౌరవం, ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కంటెంట్ సృష్టించడాన్ని నియంత్రించాలని కోరారు. ముఖ్యంగా సినీ కళాకారులు, ఆర్టిస్టుల గౌరవం, గుర్తింపును కాపాడాల్సిన అవసరం ఉందని చిరంజీవి (Megastar Chiranjeevi) పేర్కొన్నారు. సాంకేతికతను సృజనాత్మక ప్రయోజనాలకు ఉపయోగించాలి తప్ప, ఇతరుల వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వినియోగించకూడదని అభిప్రాయపడ్డారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

