రైల్వేలో విద్యార్థులకు ప్రత్యేక సదుపాయం
* బాలురకు ఇంటర్ వరకు.. బాలికలకు డిగ్రీ వరకు
* 150 కి.మీ వరకు ఉచిత ప్రయాణం
* విద్యార్థుల కోసం రైల్వే ప్రత్యేక సదుపాయం..
ఆకేరు న్యూస్, డెస్క్ : విద్యార్థులకు భారతీయ రైల్వే శాఖ అందిస్తున్న ప్రత్యేక సదుపాయం గురించి చాలామందికి తెలియదు. అర్హత కలిగిన బాలురు 12వ తరగతి వరకు, బాలికలు డిగ్రీ పూర్తయ్యే వరకు ఇంటి నుంచి విద్యాసంస్థకు రాకపోకల కోసం ప్యాసింజర్, లోకల్ రైళ్లలో ఉచితంగా(Indian Railways Free Travel) ప్రయాణించవచ్చు. ఈ సదుపాయం రెండో తరగతి మంత్లీ సీజన్ టికెట్ (MST) రూపంలో అందుబాటులో ఉంటుంది. ఇంటి వద్ద ఉన్న రైల్వే స్టేషన్ నుంచి విద్యాసంస్థకు సమీపంలోని స్టేషన్ వరకు గరిష్ఠంగా 150 కిలోమీటర్ల దూరానికి ఈ వెసులుబాటు వర్తిస్తుంది.
* టికెట్ ఎలా పొందాలి..
అర్హత కలిగిన విద్యార్థులు సంబంధిత విద్యాసంస్థ ధ్రువీకరణతో రైల్వే టికెట్ కౌంటర్లో దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన గుర్తింపు, విద్యార్థి వివరాలు సమర్పించిన అనంతరం నిబంధనల ప్రకారం ఉచిత మంత్లీ సీజన్ టికెట్ జారీ చేస్తారు.
* ఇతర రాయితీలు కూడా..
విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లేందుకు, విద్యా పర్యటనలకు రైల్వే శాఖ ప్రత్యేక రాయితీలను అందిస్తోంది. సాధారణ విద్యార్థులకు రెండో తరగతి, స్లీపర్ క్లాస్ టికెట్లపై 50 శాతం రాయితీ ఉండగా, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 75 శాతం రాయితీ వర్తిస్తుంది.
పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కూడా కొన్ని ప్రత్యేక రాయితీలు (Indian Railways Free Travel) ఉన్నాయి. అయితే ఉచిత MST కేవలం రెండో తరగతి ప్రయాణానికే వర్తిస్తుంది. మెయిల్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లలో ఈ టికెట్‌తో ప్రయాణించడానికి అనుమతి లేదు. విద్యార్థులు టికెట్ తీసుకునే ముందు రైల్వే కౌంటర్లో అర్హత, అవసరమైన పత్రాల వివరాలు తెలుసుకోవాలి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

