Mattula Vagu Bridge
* రత్నతండ గిరిజనుల వేడుకోలు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: జనగామ జిల్లా చిల్పూర్ మండలం లింగంపల్లి శివారులోని మత్తుల వాగుపై వంతెన లేదా కల్వర్టు నిర్మించాలని రత్నతండ గిరిజనులు కోరుతున్నారు. తండాలో 13 గిరిజన కుటుంబాలకు చెందిన సుమారు 40 మంది నివసిస్తుండగా, మరో 50 మంది రైతులు ప్రతిరోజూ ఇదే మార్గంలో పొలాలకు వెళ్తున్నారు.
తండాకు వెళ్లే మార్గంలో మత్తుల వాగు అడ్డంగా ఉండటంతో సరైన రోడ్డు, వంతెన సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు దారి పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలు కష్టంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తే విద్యార్థులు, రైతులు, అత్యవసర వైద్యం అవసరమైన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
సమస్య పరిష్కారం కోసం రత్నతండ వాసులు, రైతులు సోమవారం ఎంపీడీవోకు వినతిపత్రం అందించారు. వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించడంతో పాటు మత్తుల వాగుపై వంతెన లేదా కల్వర్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కత్తి పండ్, బానోత్ గణేష్, అపారదాపు రవికుమార్ తదితరులు కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
