Telangana HC Assembly Incident
* హైకోర్టులో డీజీపీకి ఊహించని షాక్
* అసెంబ్లీ ఘటనపై డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ గేటు వద్ద బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధుల నిరసన సందర్భంలో చోటుచేసుకున్న అవాంఛనీయ ఘటనలపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నిరసన తెలిపిన మహిళా ఎమ్మెల్యేల పట్ల అసభ్యంగా, దురుసుగా ప్రవర్తించిన పోలీసులను తక్షణమే గుర్తించాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)ని న్యాయస్థానం ఆదేశించింది.
* స్పీకర్ ముందే రిపోర్ట్ ఉంచాలి..
అసెంబ్లీ నిబంధనలు లేదా ఉల్లంఘనలపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం అసెంబ్లీ స్పీకర్‌కే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. పోలీసుల ప్రవర్తన, వారిపై తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన సమగ్ర నివేదికను స్పీకర్ ముందు ఉంచాలని డీజీపీకి హైకోర్టు సూచించింది.
ఒకవేళ పోలీసులు స్పీకర్ ఇచ్చిన ఆదేశాల మేరకే వ్యవహరించి ఉంటే, ఆ వ్యవహారం స్పీకర్ అధికార పరిధిలోకి వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. స్పీకర్ ఉత్తర్వులను మార్చడానికి ఎలాంటి బలమైన కారణాలు కనిపించడం లేదని అభిప్రాయపడింది.
* ఆధారాలు లేవు.. నివేదిక సమర్పించండి..
ఈ వ్యవహారంలో మహిళా ఎమ్మెల్యేలు పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని హైకోర్టు వెల్లడించింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది.
ఒకవేళ ఈ సంఘటన అసెంబ్లీ పరిసరాల బయట లేదా గేటు వద్ద జరిగి ఉంటే, దానికి సంబంధించిన వివరణాత్మక రిపోర్టును నేరుగా కోర్టుకే సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
