పదో తరగతి విద్యార్థులు (ఫైల్ ఫొటో)
* నవంబర్ 26 వరకు ఛాన్స్
* లేట్ ఫీజుతో జనవరి 4 వరకు అవకాశం
ఆకేరు న్యూస్, డెస్క్ : తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు విద్యాశాఖ ఊరటనిచ్చింది. 2027 మార్చిలో నిర్వహించనున్న పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు (Telangana SSC Exam Fee) గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో నవంబర్ 16తో ముగియాల్సిన గడువును నవంబర్ 26 వరకు పెంచింది.
దీంతో విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించకుండా మరో పది రోజులపాటు పరీక్ష ఫీజు చెల్లించే (Telangana SSC Exam Fee Last Date) అవకాశం లభించింది. ఈ గడువు పొడిగింపు రెగ్యులర్ విద్యార్థులతో పాటు గతంలో ఒకసారి పరీక్షలో తప్పి తిరిగి రాయనున్న అభ్యర్థులకు కూడా వర్తిస్తుంది. SSC, OSSC, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
* ఆలస్య రుసుముతో కొత్త షెడ్యూల్ ఇదే..
నవంబర్ 26లోగా ఫీజు చెల్లించలేని విద్యార్థుల కోసం ఆలస్య రుసుముతో మరికొన్ని అవకాశాలను కల్పించారు.
ఆలస్య రుసుము లేకుండా : నవంబర్ 26, 2026 వరకు
రూ.50 ఆలస్య రుసుముతో : నవంబర్ 28 నుంచి డిసెంబర్ 8 వరకు
రూ.200 ఆలస్య రుసుముతో : డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 21 వరకు
రూ.500 ఆలస్య రుసుముతో : డిసెంబర్ 23 నుంచి 2027 జనవరి 4 వరకు
పరీక్ష రాసే సబ్జెక్టుల సంఖ్య ఆధారంగా ఫీజు నిర్ణయించారు.
మూడు సబ్జెక్టుల వరకు హాజరయ్యే విద్యార్థులు రూ.110 చెల్లించాలి. మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు లేదా అన్ని సబ్జెక్టులకు హాజరయ్యే అభ్యర్థులు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. ఒకేషనల్ కోర్సు విద్యార్థులు సాధారణ పరీక్ష ఫీజుకు అదనంగా రూ.60 చెల్లించాలి.
* ఫీజు చెల్లింపు విధానం.. విద్యార్థులకు సూచనలు..
విద్యార్థులు తమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు లేదా ప్రిన్సిపాల్‌ను సంప్రదించి పరీక్ష ఫీజు చెల్లించాలి. పాఠశాలల ద్వారా బోర్డు వెబ్‌సైట్‌లోని స్కూల్ లాగిన్ ఉపయోగించి సైబర్ ట్రెజరీ ఆన్లైన్ విధానంలో ఫీజు జమ చేయాలి. మాన్యువల్ బ్యాంకు చలాన్ల ద్వారా చెల్లింపులకు అనుమతి లేదని పరీక్షల విభాగం స్పష్టం చేసింది.
పరీక్షల దరఖాస్తులో విద్యార్థుల పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, ఇతర వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలని పాఠశాలలకు సూచించారు. వివరాల్లో తప్పులు ఉంటే ముందుగానే సరిచేసుకోవాలి. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది.
* అర్హులైన విద్యార్థులకు ఫీజు మినహాయింపు..
ప్రభుత్వ పరీక్షల విభాగం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, తొలిసారి రెగ్యులర్ అభ్యర్థులుగా పరీక్షలు రాసే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల్లో నిర్దేశించిన తల్లిదండ్రుల ఆదాయ పరిమితి లేదా భూమి పరిమితి నిబంధనలకు అర్హులైన వారికి పరీక్ష ఫీజు మినహాయింపు పొందే అవకాశం ఉంది.
ఇందుకు సంబంధిత ధ్రువపత్రాలను పాఠశాల ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్ష ఫీజు గడువు పొడిగింపును సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ సూచిస్తోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

