* తెల్లవారుజాము 3.15 గంటల వరకు సమావేశాలు
* మా చిత్తశుద్ధికి నిదర్శనం : భట్టి
ఆకేరు న్యూస్ డెస్క్ : అసెంబ్లీ సమావేశాల (Assembly meetings) నిర్వహణలో తెలంగాణ సర్కారు (Telangana Government) రికార్డు (Record) సృష్టించింది. సోమవారం ఉదయం 10 గంటలకు మొదలైన శాసనసభ.. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలా 15 నిమిషాల వరకు సాగింది. ఏకంగా 18 గంటలకు పైగా సమావేశాలు కొనసాగాయి. గతంలో 12 గంటల పాటు కేసీఆర్ ప్రభుత్వం సభను నడిపింది. ఇప్పుడు ఆ రికార్డును రేవంత్ సర్కార్ బ్రేక్ (Revanth Government break) చేసింది. సుదీర్ఘంగా జరిగిన ఈ సెషన్ (Session) లో 19 పద్దులకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది శాసనసభ. 19 పద్దులపై ఐదుగురు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. ప్రజాపాలనపై కాంగ్రెస్ ప్రభుత్వాని (Congress Government) కి ఉన్న చిత్తశుద్ధికి సమావేశాల నిర్వహణే నిదర్శనమని భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రకటించారు. తమ ప్రభుత్వం హయాంలో విద్యుదుత్పత్తి, సరఫరా మెరుగుపడ్డాయని తెలిపారు. అలాగే.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు.. అర్హత నిష్పత్తిని 1:100 చేయాలన్న విజ్ఞప్తులు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని.. అయితే నోటిఫికేషన్ సమయంలోనే అర్హత ప్రాతిపదికను 1:50గా నిర్దేశించినందున, ఎవరైనా కోర్టుకు వెళితే సమస్యలు ఎదురై, పరీక్ష ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతో తాము నిర్ణయం తీసుకోలేదని భట్టి పేర్కొన్నారు.
—————-