TSUTF
TSUTF| ఆకేరు న్యూస్, కమలాపూర్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసి వెంటనే అమలు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు డిమాండ్ చేశారు. కమలాపూర్ మండలంలోని పలు పాఠశాలల్లో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా కానిపర్తి ప్రాథమికోన్నత పాఠశాలలో పెండెం రాజు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పీఆర్సీ అమలు చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి, 38 నెలలు గడిచినా ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు.
సెప్టెంబర్ 30తో పీఆర్సీ గడువు ముగియనున్న నేపథ్యంలో గడువును పొడిగించకుండా వెంటనే పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసి అమలు చేయాలని కోరారు. అలాగే దసరా సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని, జీవో నంబర్ 25ను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సీఎస్ఆర్ మల్లిక్, సీనియర్ నాయకులు పల్లె శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
