Delhi Crime
Delhi Crime| ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ: ఢిల్లీలోని సెంట్రల్ ప్రాంతంలో వికాస్ కాలియా గ్యాంగ్‌తో సంబంధం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్న ఇద్దరిని స్పెషల్ స్టాఫ్ అరెస్ట్ చేసింది. సెప్టెంబర్‌లో సదర్ బజార్–నబీ కరీం శోభాయాత్ర సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించిన హత్యాయత్నం కేసులో వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
13, 9 కేసులు
పోలీసుల వివరాల ప్రకారం.. అరెస్టైన వారిలో ఒకరిని ఆకాష్ అలియాస్ మత్తీగా, మరొకరిని అతడి సహచరుడిగా గుర్తించారు. వీరిద్దరిపై గతంలోనూ పలు క్రిమినల్ కేసులు నమోదైనట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మధుర్ వర్మ తెలిపారు. ఒకరిపై 13 కేసులు, మరొకరిపై 9 కేసులు ఉన్నట్లు చెప్పారు.
హత్యాయత్నం, దోపిడీ, లూటీ, స్నాచింగ్, ఇళ్లలో చోరీ తదితర కేసులు వారి నేరచరిత్రలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులపై కాల్పులు
పోలీసులకు అందిన సమాచారం ఆధారంగా నిందితులను అడ్డుకున్న సమయంలో వారు పోలీసులపై కాల్పులు జరిపినట్లు మధుర్ వర్మ తెలిపారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఇద్దరి కాళ్లకు బుల్లెట్ గాయాలైనట్లు వెల్లడించారు.
నిందితుల్లో ఒకరు జరిపిన కాల్పుల్లో బుల్లెట్ పోలీసు అధికారి ధరించిన బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ను తాకినట్లు పోలీసులు తెలిపారు. అయితే పోలీసు సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు.
అరెస్టైన ఇద్దరూ సదర్ బజార్ ప్రాంతంలో కార్యకలాపాలు సాగించే వికాస్ కాలియా గ్యాంగ్‌తో సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
