Telangana BC Overseas Vidyanidhi
* ఓవర్సీస్ విద్యానిధి గడువు పొడిగింపు
ఆకేరు న్యూస్,హైదరాబాద్ : విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే తెలంగాణ బీసీ, ఈబీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అవకాశం కల్పించింది. మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ, ఈబీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం దరఖాస్తుల గడువును ప్రభుత్వం అక్టోబర్ 15, 2026 వరకు పొడిగించింది.
ఈ పథకం కింద మొత్తం 350 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.
ఇందులో 250 మంది బీసీ విద్యార్థులు, 100 మంది ఈబీసీ విద్యార్థులు ఉంటారు. ఎంపికైన విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య కొనసాగించేందుకు ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. దీంతో పాటు విమాన టికెట్, వీసా రుసుములను కూడా ప్రభుత్వం భరిస్తుంది.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి. అర్హత కలిగిన విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వ ePASS వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
