Telangana Congress MLC Candidates
* కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన
ఆకేరు న్యూస్,హైదరాబాద్ : తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది.
మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి సామ రామ్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. అదేవిధంగా నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసింది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనతో ఎన్నికల రాజకీయం మరింత వేడెక్కే అవకాశం ఉంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
