Madanapalle CM Chandrababu Naidu and Deputy CM Pawan Kalyan
మదనపల్లెలో ప్రతిష్ఠాత్మక కార్యక్రమం..
అకేరు న్యూస్, డెస్క్ : మదనపల్లెలో రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగు పడింది. రూ.లక్ష కోట్ల పెట్టుబడితో రాయలసీమలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. అలాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు కూడా శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో ప్రణాళిక రూపొందించామని తెలిపారు. కరువు సీమను సిరుల సీమగా మార్చడమే లక్ష్యమన్నారు. 2026 అక్టోబర్ 2 రాయలసీమ చరిత్రలో నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు.
అన్నదాతకు ప్రయోజనం చేకూర్చేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చిందని చంద్రబాబు తెలిపారు. కరువు నేలను గ్లోబల్ ఫ్రూట్ బౌల్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. 6 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటల సాగును విస్తరించనున్నట్లు వెల్లడించారు. ప్రకృతి సేద్యంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ముందంజలో ఉందని పేర్కొన్నారు. రాయలసీమకు సాగునీరు అందిస్తే రైతులు బంగారం పండిస్తారని అన్నారు. పండ్లు, కూరగాయలు, పూల సాగుకు రాయలసీమ ఎంతో అనుకూలమైన ప్రాంతమని
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రాయలసీమ ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా మారబోతోందన్నారు. రూ.లక్ష కోట్ల పెట్టుబడితో హార్టికల్చర్ హబ్‌కు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఉద్యాన పంటల సాగు విస్తరణతో పాటు నీటి సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. రాయలసీమ రైతులకు పట్టుదల, సామర్థ్యం ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. రాయలసీమ పౌరుషం ఏంటో అందరికీ తెలుసని అన్నారు. రాయలసీమ రైతుల సత్తా ఏంటో ఇప్పుడు ప్రపంచం చూస్తుందని చెప్పారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ఇక్కడి రైతులు పండించే పంటలు దేశీయ మార్కెట్లకే పరిమితం కాకుండా ఇతర దేశాలకు కూడా ఎగుమతి అయ్యేలా చర్యలు చేపట్టాలని అన్నారు.
హార్టికల్చర్ హబ్ ద్వారా ఉద్యాన పంటల విస్తరణ, రైతులకు మార్కెట్ అవకాశాలు, నీటి సంరక్షణ, ఆధునిక వ్యవసాయ పద్ధతులకు ప్రాధాన్యం కల్పించనున్నారు. రాయలసీమను అంతర్జాతీయ స్థాయి పండ్ల ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
