Pan IIT AP Summit
* నేడు పాన్‌ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్–2026
ఆకేరు న్యూస్, విజయవాడ : విజయవాడలో నేడు పాన్‌ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్–2026 జరగనుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించనున్న ఈ సదస్సుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సహా పలువురు మంత్రులు, ఐఐటీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, టెక్నాలజీ నిపుణులు, పాలసీ మేకర్లు పాల్గొననున్నారు.
‘ఆంధ్రాస్ రెసిలెంట్ డీప్‌టెక్ డికేడ్’ థీమ్‌తో సదస్సు జరగనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డీప్‌టెక్, స్టార్టప్‌లు, డిజిటల్ ఆవిష్కరణలు, పెట్టుబడులు వంటి అంశాలపై చర్చలు, ప్యానల్ సమావేశాలు, రౌండ్‌టేబుల్ భేటీలు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ, పరిశోధన, ఆవిష్కరణలకు కీలక కేంద్రంగా అభివృద్ధి చేయడంపై సదస్సులో ప్రత్యేకంగా చర్చించనున్నారు. 23 ఐఐటీలకు చెందిన అలుమ్ని, పరిశ్రమల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, స్టార్టప్ సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు.
సమ్మిట్‌లో ‘క్యూ-శివ’ క్వాంటమ్ కంప్యూటింగ్ హార్డ్‌వేర్ టెస్టింగ్ ల్యాబ్‌లను సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నట్లు సమాచారం. అలాగే పాన్‌ఐఐటీ అమరావతి కౌన్సిల్, డీప్‌టెక్ పాలసీ, వెంచర్ ఫండ్, గ్లోబల్ ఐఐటీ మెంటర్ నెట్వర్క్ వంటి ప్రతిపాదిత కార్యక్రమాలపై కీలక ప్రకటనలు ఉండనున్నాయి.
విజయవాడలో జరిగే ఈ సదస్సు ద్వారా రాష్ట్రంలో టెక్నాలజీ, పరిశోధన, పెట్టుబడులు, స్టార్టప్ రంగాలకు మరింత ఊతం ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
