Telangana High Court
*సీపీ సజ్జనార్‌కు హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని భవానీనగర్ పోలీసులపై ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.
తనపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాకపోయినా భవానీనగర్ ఎస్ఐ, సీఐ తన చేతులు, కాళ్లు కట్టేసి.. కళ్లల్లో కారం చల్లి తీవ్రంగా కొట్టారని తలాబ్‌కట్టకు చెందిన షానవాజ్ ఆలం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే తన ఫిర్యాదుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి, బాధ్యులుగా తేలిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీ సజ్జనార్‌ను ఆదేశించింది.
అయితే కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి విచారణ చేపట్టలేదని ఆరోపిస్తూ షానవాజ్ ఆలం మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. గతంలో ఇచ్చిన ఆదేశాల అమలుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
అదే సమయంలో కోర్టు ఆదేశాలను అమలు చేయలేదన్న ఆరోపణలపై సీపీ సీవీ సజ్జనార్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో తదుపరి విచారణ సందర్భంగా తీసుకున్న చర్యల వివరాలను కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
