Retired RWS superintendent Sauram Venkateshwarlu (Deshaipet Venkanna)
* ఆర్ డబ్ల్యు ఎస్ లో సూపరింటెండెంట్ గా రిటైర్డ్
* వామ పక్ష ప్రజా ఉద్యమాలతో మమేకం
ఆకేరు న్యూస్, హనుమకొండ : గ్రామీణ నీటి సరఫరా శాఖ వరంగల్ రిటైర్డ్ సూపరింటెండెంట్ సౌరం వెంకటేశ్వర్లు ( దేశాయిపేట వెంకన్న) ( 72 ) ఆదివారం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు . దేశాయిపేట ఏనుమాములకు చెందిన వెంకటేశ్వర్లు 2013 లో ఆర్ డబ్ల్యూ ఎస్ ( RWS ) సూపరింటెండెంట్ గా పదవి విరమణ చేశారు.. శనివారం రాత్రి చాతిలో నొప్పి రావడంతో హంటర్ రోడ్ లో ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు.. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం ఐదుగంటలకు మృతి చెందాడని బంధువులు తెలిపారు .సోమవారం మద్యాహ్నం వరకు దేశాయిపేట – ఏనుమాముల లో అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు .
* వామపక్ష ఉద్యమాలతో మమేకం
విద్యార్థి దశ నుంచే వామపక్ష భావజాలంతో పెరిగారు .. ప్రభుత్వ ఉద్యోగం లో ఉండి కూడా వామపక్ష ఉద్యమాలతో మమెకం అయ్యారు..అప్పటి పీపుల్స్ వార్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడని పోలీసులు కేసులు నమోదు చేసారు..పోలీసులు అరెస్ట్ చేసి చాలా సార్లు చిత్రహింసలకు గురయినాడని బంధువులు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
