MRPS
MRPS| ఆకేరు న్యూస్, పాలకుర్తి: హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 6న నిర్వహించనున్న మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) ప్రతినిధుల జాతీయ సదస్సును విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు చెరుకుపల్లి యాదగిరి స్వామి పిలుపునిచ్చారు.
ఈ మేరకు జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో జాతీయ సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యాదగిరి స్వామి మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, మాదిగ విద్యార్థుల భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై సదస్సులో చర్చించనున్నట్లు చెప్పారు. విద్యార్థుల హక్కుల సాధన కోసం ఐక్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
పాలకుర్తి మండలంలోని అన్ని గ్రామాల నుంచి మాదిగ విద్యార్థులు, యువకులు, నాయకులు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో హాజరై సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జలగం నరేష్, మాదిగ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఎడవల్లి సోమచందర్, మాదిగ దండోరా కళామండలి జనగామ జిల్లా కోఆర్డినేటర్ గుగ్గిళ్ల ఎల్లయ్య, అనపర్తి చిరంజీవి, అనపర్తి వెంకన్న, జన్ను రాజు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
