అమెరికా అద్యక్ష బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ - కమలా హారిస్
* ఫాక్స్ న్యూస్ ప్రతిపాదనకు అంగీకరించిన ట్రంప్
ఆకేరు న్యూస్ డెస్క్ : డెమోక్రటిక్ అభ్యర్థిగా భారత సంతతి అమెరికన్ కమలా హారిస్ ( Kamala Harris ) పేరు ఖరారైనప్పటి నుంచీ అమెరికా ఎన్నికల ప్రచారం మరింత జోరందుకుంది. ఇప్పుడు తాజాగా కమలా హారిస్‌తో ముఖాముఖి చర్చకు రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) ఓకే చెప్పారు. సెప్టెంబర్ 4న కమలా హారిస్‌తో ప్రెసిడెన్షియల్ డిబేట్ నిర్వహించాలని ఫాక్స్ న్యూస్ ( Fox News ) చేసిన ప్రతిపాదనకు ట్రంప్ అంగీకరించారు. గతంలో ఏబీసీ ( ABC News) లో బైడెన్‌తో చర్చ జరిగిందని గుర్తు చేశారు. అయితే, ఆ డిబేట్ అనంతరం బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నట్లు పేర్కొన్నారు. జూన్ 27న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ మధ్య డిబేట్ లో ట్రంప్‌దే పైచేయిగా కనిపించింది. దీంతో బైడెన్‌కు సొంత పార్టీ నుంచే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత అధ్యక్ష రేసు నుంచి తాను వైదొలుగుతున్నట్లు బైడెన్ ప్రకటించారు. అదే సమయంలో డెమోక్రాట్ల అభ్యర్థిగా ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు కమలా హారిస్ బరిలోకి వచ్చారు. ఈ క్రమంలో ట్రంప్‌తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని కూడా ప్రకటించారు. కానీ ట్రంప్ మాత్రం అందుకు అంగీకరించలేదు. డెమోక్రాట్లు తమ అధ్యక్ష అభ్యర్థిని అధికారికంగా నిర్ణయించే వరకూ వేచి చూస్తానని వెల్లడించారు. ఈ క్రమంలో నిన్న కమలా హారిస్‌ను అధ్యక్ష అభ్యర్థిగా డెమోక్రాటిక్ పార్టీ ఖరారు చేసింది. దీంతో హారిస్‌తో డిబేట్‌కు ట్రంప్ సై అన్నారు.
——————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
