* పాలు, పప్పు దినుసులు, మసాలాల ఉత్పత్తిలో నంబర్ వన్
* ప్రపంచ ఆహార భద్రతకు కృషి : ప్రధాని మోదీ
ఆకేరు న్యూస్ డెస్క్ : భారత్‌లో ఆహార నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ప్రపంచ ఆహార భద్రతకు కూడా భారత్ కృషి చేస్తోందని వెల్లడించారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకానమిస్ట్స్ సదస్సు ( International Conference of Agricultural Economists| ICAE )లో ప్రధాని మాట్లాడారు. 65 ఏళ్ల తర్వాత ఇండియాలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. సమగ్ర వ్యవసాయ విధానంపై 2024-25 కేంద్ర బడ్జెట్లో ఫోకస్ పెట్టినట్లు ప్రధాని మోదీ తెలిపారు. గతంలో ఇండియాలో ఈ సమావేశాన్ని నిర్వహించినప్పుడు, అప్పుడే భారత్ స్వతంత్య్రాన్ని సాధించిందని, ఆ సమయంలో దేశం వ్యవసాయ, ఆహార భద్రత సవాళ్లను ఎదుర్కొన్నదన్నారు. ఇప్పుడు భారత్ ఆహార మిగులు దేశంగా మారిందన్నారు. పాలు, పప్పు దినుసులు, మసాలాలు ఉత్పత్తి చేయడంలో భారత్ నెంబర్‌వన్‌గా ఉందన్నారు. ఆహారధాన్యాలు, పండ్లు, కూరగాయలు, దూది, చక్కెర, టీ పొడి ఉత్పత్తిలో ఇండియా రెండవ స్థానంలో ఉన్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ సదస్సులో 70 దేశాలకు చెందిన వెయ్యి మంది రైతు ఆర్తికవేత్తల ప్రతినిధులు హాజరయ్యారు.
—————————————-