Jhansi Rajender Reddy
ఆకేరు న్యూస్, రాయపర్తి: రాయపర్తి మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతిచెందిన వారి కుటుంబాలను గురువారం టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి పరామర్శించారు.
కాట్రపల్లి గ్రామానికి చెందిన ప్రముఖులు, హన్మకొండ ఏకశిలా హాస్పిటల్ డైరెక్టర్ కుందూరు వెంకట్ రెడ్డి గారు ఇటీవల స్వర్గస్థులైన విషయం తెలుసుకున్న ఆమె, కాట్రపల్లిలోని ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. వెంకట్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ సానుభూతిని తెలిపారు.
అదేవిధంగా, హైదరాబాద్లో ఉద్యోగ బాధ్యతల్లో ఉంటూ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన ఎస్ఐ కునుసోతు వెంకన్న,స్వగ్రామమైన కిష్టాపురానికి ఆమె వెళ్లారు. వెంకన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, వారి కుటుంబ సభ్యులకు కొండంత ధైర్యాన్ని చెప్పారు.
ఈ సందర్భంగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ… “వెంకట్ రెడ్డి మరణం, విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ వెంకన్న అకాల మరణం తీవ్ర విచారకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ కష్ట సమయంలో వారికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

Please tell us what is wrong. Your report will be sent to the website team.

