Congress Leader Ramakrishna, SC ST Minority Votes
* ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓట్ల తొలగింపు ప్రజాస్వామ్యంపై దాడి
* సిసి జ్ఞానేశ్ కుమార్ను బాధ్యతల నుంచి తక్షణమే తొలగించాలి
* టీపీసీసీ సీనియర్ నేత డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అధికారులకు సివిల్, క్రిమినల్ విచారణల నుంచి అపరిమిత రక్షణ కల్పిస్తూ తీసుకువచ్చిన ‘సెక్షన్ 16’ నిబంధనను తక్షణమే పునఃపరిశీలించి, రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ సీనియర్ నేత డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు.
గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాబోయే ఎన్నికల్లో పునరావృత లబ్ధి పొందాలనే రాజకీయ దురుద్దేశంతోనే బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి ఇలాంటి నిబంధనల ద్వారా అడ్డుగోడలు కడుతోందని విమర్శించారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ఏకంగా 13 కోట్ల ఓట్లు మాయమవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన అర్హులైన ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఓట్లను తొలగించడం దారుణమని మండిపడ్డారు.
మహానీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా ప్రసాదించిన ఓటు హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. వెనుకబడిన, మైనారిటీ వర్గాల హక్కులకు భంగం వాటిల్లకుండా తక్షణమే స్పష్టమైన, పారదర్శక విధివిధానాలను అమలు చేయాలి. రాజ్యాంగ బద్ధమైన సంస్థల స్వయంప్రతిపత్తిని కాపాడటానికి, ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

