Arthritis Symptoms Yashoda Hospitals
* ప్రారంభదశలోనే గుర్తించి తగిన చికిత్స అవసరం
* యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి
ఆకేరు న్యూస్, నెట్వర్క్ : ఆర్థరైటిస్ కేవలం వృద్ధుల్లోనే కాకుండా యువత, చిన్నారుల్లోనూ కనిపిస్తుందని, కీళ్లలో నొప్పి, వాపు, బిగుతు, కదలికల్లో ఇబ్బందులు వంటి లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్య చికిత్స పొందడం ముఖ్యమని యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి పేర్కొన్నారు.
ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం సందర్భంగా కీళ్ల ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు యశోద హాస్పిటల్స్-సికింద్రాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ’పెడల్ ఫర్ ఆర్థరైటిస్ అవేర్నెస్‘ సైక్లోథాన్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
’కదలికే స్వేచ్ఛ-ఆరోగ్యకరమైన కీళ్లే చురుకైన జీవితానికి పునాది‘ అనే సందేశంతో ఈ సైక్లోథాన్ సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు సాగింది.
* కదలికల్లో ఇబ్బందులపై నిర్లక్ష్యం వద్దు
ఈ సందర్భంగా డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ, కీళ్ల నొప్పులు, కదలికల్లో ఇబ్బందులను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్య సలహా తీసుకోవాలని, ఆరోగ్యానికి తగిన వ్యాయామాన్ని రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.
ఆరోగ్యకరమైన ఆహారం, చురుకైన జీవనశైలి మెరుగైన ఆరోగ్యానికి దోహదపడతాయని, ఆర్థరైటిస్పై అపోహలను తొలగించి ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
* కీళ్ల ఆరోగ్య పరిరక్షణ కీలకం
సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ విక్రమ్ బైరే మాట్లాడుతూ, ఆర్థరైటిస్ ఉన్నవారు కదలికలను పూర్తిగా తగ్గించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
వైద్యుల సూచనల మేరకు సైక్లింగ్ వంటి తగిన వ్యాయామాలు కీళ్ల పనితీరు, కండరాల బలం, శరీర సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని వివరించారు. ముందస్తు గుర్తింపు, సరైన చికిత్స, క్రమబద్ధమైన వ్యాయామం కీళ్ల ఆరోగ్య పరిరక్షణలో కీలకమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ యూనిట్ హెడ్ డాక్టర్ విజయ్ కుమార్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎ. లింగయ్య, మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ విష్ణురెడ్డి, పలువురు వైద్యులు, ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్లు, నర్సింగ్, పారామెడికల్, ఫిజియోథెరపీ బృందాల సభ్యులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

