* పంప్‌హౌజ్ నుంచి కెనాల్ లోకి ఎగసిపడ్డ గోదావరి జలాలు
* ఈనెల 15న పంపుహౌజ్ ను ప్రారంభించనున్న సీఎం
ఆకేరు న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (Sita Rama Lift Irigation Project) ట్రయల్ రన్ ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttamkumar Reddy), తుమ్మల నాగేశ్వరరావు(Tummala NageswaraRAo), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Pongulate SrinivasReddy)ఆదివారం ప్రారంభించారు. పంప్‌హౌజ్ నుంచి కెనాల్ లోకి ఎగసిపడ్డ గోదావరి జలాలు ఎగసిపడ్డాయి. ట్రయల్ రన్ సక్సెస్ (Trail Run Success)కావడంతో ఆనందం వెలిబుచ్చారు. పుసుగూడెం, కమలాపురం పంపుహౌస్ ల వద్ద పర్యటించారు. ఈ నెల 15న సీఎం రేవంత్‌రెడ్డి (CM RevanthReddy)చేతుల మీదుగా ప్రాజెక్టుకు చెందిన మూడు పంప్‌హౌజ్‌లను ప్రారంభిస్తారని తెలిపారు. ఈమేరకు సచివాలయంలో శనివారమే సీతారామ ప్రాజెక్టుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. 15న ఖమ్మం జిల్లా వైరాలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పెండింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 67 టీఎంసీల గోదావరి జలాలను కేటాయించాలని కోరుతూ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని, సుప్రీంకోర్టు(SuprimCourt)తోపాటు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖాల అనుమతులపై దృష్టి సారించాలని సూచించారు. 15న సీఎం సభకు ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.
—————————————