ఆకేరు న్యూస్, తిరుపతి : తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy Cm Bhatti Vikramarka) తిరుమల తిరుపతి ఆలయాన్ని(Tirumala-temple) సందర్శించారు. ఆదివారం తెల్లవారుజామున సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం పలకగా… ఆలయ అధికారులు తీర్ధప్రసాదాలు అందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
————————-