* తెల్లవారుజామున నుంచీ వర్షం
* తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్(Hyderabad)లో నిన్న అర్దరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇప్పుడు కూడా వర్షం కొనసాగుతోంది. బంజారాహిల్స్(Banjarahills), జూబ్లీహిల్స్, బోరబండ, ఉప్పల్, చాదర్‌ఘాట్, భరత్‌నగర్, దిల్సుఖ్నగర్(Dilsukhnagar), మలక్‌పేట ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వాతావరణశాఖ (Meteorological Department)కీలక అప్ డేట్ చేసింది. మరో రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Rains) కురుస్తాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం, బలమైన నైరుతి రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ(Telangana)లోని నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(Meteorological Department) తెలిపింది. అంతేకాదు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో మంగళవారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని..జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
———————————————