Tiger Safari
* సఫారీలో పర్యాటకులకు కనువిందు!
* నీటి కుంటలో సేదతీరుతున్న పులులు
* సెల్ఫోన్లలో దృశ్యాలను బంధించిన పర్యాటకులు
ఆకేరు న్యూస్, చంద్రపూర్ : నీటి కుంటలోకి దిగి సేదతీరుతున్న పులులు.. చుట్టూ పచ్చని అడవి.. సఫారీకి వెళ్లిన పర్యాటకులకు ఈ దృశ్యాలు కనువిందు చేశాయి. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా బల్లార్షా పరిధిలో ఉన్న కార్వా–బల్లార్షా జంగిల్ సఫారీలో (Tiger Safari) పులుల జలకాలాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
సఫారీ బఫర్ జోన్లోని ఓ నీటి కుంట వద్ద పులులు సంచరిస్తూ, నీటిలో సేదతీరుతున్న దృశ్యాలను పర్యాటకులు వీక్షించారు. కొందరు తమ సెల్ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ దృశ్యాలు స్థానికంగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
పులులతోపాటు ఇతర వన్యప్రాణులను చూసేందుకు ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు సఫారీకి తరలివస్తున్నారు. అడవి వాతావరణంలో వన్యప్రాణులను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉండటంతో కార్వా–బల్లార్షా జంగిల్ సఫారీ సందర్శకులను ఆకట్టుకుంటోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

