Jangaon News Railway Track Death
* మాణిక్యపురం గ్రామస్తుడిగా గుర్తింపు
ఆకేరు న్యూస్, జనగామ : జనగామ (Jangaon News) పట్టణంలోని బీరప్పగడ్డ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వే ట్రాక్‌పై మరికుక్కల నరేష్ అనే 24 ఏళ్ల యువకుడి మృతదేహం లభ్యమైంది. బాణాపూరం సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద ఉన్న పట్టాలపై మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
డయల్ 112కు అందిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, యువకుడిని లింగాలఘనపురం మండలం మాణిక్యపురం గ్రామానికి చెందిన నరేష్‌గా గుర్తించారు. నరేష్ మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది ప్రమాదమా లేదా ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. యువకుడి మృతితో మాణిక్యపురం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

