Chahat Bajpai
* రక్షణ పరికరాలు తప్పనిసరి
* ఆరోగ్యంపై కలెక్టర్ సూచనలు
Hanumakonda| ఆకేరు న్యూస్, హనుమకొండ: పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం, వ్యక్తిగత భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. విధి నిర్వహణ సమయంలో ప్రతి కార్మికుడు తప్పనిసరిగా రక్షణ పరికరాలను వినియోగించాలని స్పష్టం చేశారు.
గురువారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో కమిషనర్ టి. వెంకన్నతో కలిసి పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫారాలు, అప్రాన్లు, బూట్లు, గ్లౌజులను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్మికులకు వ్యక్తిగత భద్రతపై పలు సూచనలు చేశారు.
రక్షణ పరికరాలు తప్పనిసరి
పారిశుద్ధ్య విధులు నిర్వహించే సమయంలో కార్మికులు యూనిఫారంతో పాటు అప్రాన్లు ధరించాలని కలెక్టర్ సూచించారు. చేతులకు గ్లౌజులు, కాళ్లకు బూట్లు తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు. రక్షణ పరికరాలను నిర్లక్ష్యం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందించిన పరికరాలను క్రమం తప్పకుండా వినియోగిస్తూ, ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
కార్మికుల భద్రతే ముఖ్యం
జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికులు విధి నిర్వహణలో తగిన రక్షణ చర్యలు పాటించాలని సూచించారు. యూనిఫారంతో పాటు అందించిన భద్రతా పరికరాలను తప్పనిసరిగా ధరించాలని, తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, శానిటరీ సూపర్వైజర్లు గోల్కొండ శ్రీను, భాస్కర్, శ్యామ్రాజ్, అనిల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

