మహంకాళి ఉప్పలయ్య
* మంచూప్పుల గ్రామంలో విషాదం
* ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి
ఆకేరు న్యూస్, పాలకుర్తి: విద్యుత్ స్తంభం నుంచి పడి వ్యక్తి మృతి మృతి చెందాడు. ఈ విషాద ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం మంచూప్పుల గ్రామంలో చోటుచేసుకుంది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచూప్పుల గ్రామానికి చెందిన మహంకాళి ఉప్పలయ్య, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి ఇంట్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సమస్యను పరిష్కరించేందుకు స్వయంగా విద్యుత్ పోలు ఎక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. నడుముకు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌లో వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ ఉప్పలయ్య పరిస్థితి విషమించి మృతి చెందినట్లు పాలకుర్తి ఎస్సై ఊర సృజన్ కుమార్ తెలిపారు. మృతుడి భార్య సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఉప్పలయ్య మృతితో మంచూప్పుల గ్రామంలో విషాదం నెలకొంది. భర్తను కోల్పోయిన సునీతతో పాటు కుమారుడు, కుమార్తె కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

