పెరుమాండ్ల రామకృష్ణ, రేగుంట సునీల్
Hanumakonda| ఆకేరు న్యూస్, హనుమకొండ: ‘ఓటు బచావో – దేశ్ బచావో’ కార్యక్రమానికి మాదిగలు, దళితులు, బహుజనులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ర్ పెరుమాండ్ల రామకృష్ణ, రేగుంట సునీల్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై ఖండన
ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళితుల ఓట్లపై చేసిన వ్యాఖ్యలను నాయకులు తీవ్రంగా ఖండించారు. దళిత సమాజాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. గతంలో నీతి, నిజాయితీ, స్వేరో కమాండ్మెంట్స్ గురించి మాట్లాడిన ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల ప్రభావంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని విమర్శించారు. దళితుల పక్షాన నిలబడకపోయినా, వారిని అవమానించేలా మాట్లాడకూడదని అన్నారు.
మాదిగ హక్కుల దండోరా జిల్లా కమిటీ నియామకాలు
మాదిగ హక్కుల దండోరా హనుమకొండ జిల్లా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. జిల్లా అధ్యక్షుడిగా వక్కల ప్రభాకర్‌ను నియమించింది. వివిధ నియోజకవర్గాల ఇన్చార్జులుగా పులి శ్రీనివాస్, కొట్టె రమేష్, కొట్టె రాజు, గబ్బెట సుధాకర్‌లను నియమించినట్లు వెల్లడించింది.
రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, రిటైర్డ్ హెడ్మాస్టర్ కొమ్ముల బాబు చేతుల మీదుగా నూతన బాధ్యులకు నియామక పత్రాలను అందజేశారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు పిలుపు
భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఓటు హక్కు పరిరక్షణ లక్ష్యంగా నవంబర్ 1న ఢిల్లీలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగ సోదరులు, దళితులు, బహుజనులు, ప్రజాస్వామ్యవాదులకు నాయకులు విజ్ఞప్తి చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

