Telugu Actress Divya Vani
* రాజకీయాలు ఇక బంద్..
* బాపూ బొమ్మ దివ్య వాణి ప్రకటన
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : సినిమా రంగంలో “బాపు బొమ్మ”గా.. టివి రంగంలో “పుత్తడిబొమ్మ”గా సుప్రసిద్ధురాలైన దివ్యవాణి (Actress Divya Vani).. రాజకీయాల్లోకి వెళ్లి సినిమాకు దూరమైయ్యారు. అయితే ఇకపై రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ సినిమా రంగంపై దృష్టి సారించాలని దృఢ నిశ్చయం తీసుకున్నానని చెబుతున్నారు.
* పాలిటిక్స్‌కు బ్రేక్.
కొంతకాలం తెలుగు దేశం పార్టీలో పని చేసిన ఆమె సినిమాకు దూరంగా ఉన్నారు. కానీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా కూడా ఆమెకు ఎలాంటి పదవి రాకపోవడంతో తిరిగి సినిమాలు చెయ్యాలని దివ్యవాణి నిర్ణయించుకున్నారు.
“పెళ్ళి పుస్తకం, ఎదురింటి మొగుడు – పక్కింటి పెళ్ళాం” వంటి చిరస్మరణీయ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థిర స్థానం సంపాదించుకున్న దివ్యవాణి.. “పుత్తడి బొమ్మ” టివి సీరియల్ తోనూ ఉర్రూతలూగించారు. కన్నడలోనూ పలు చిత్రాల్లో నటించి అక్కడి ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన ఈ అందాల భామ కన్నడ అనర్గళంగా మాట్లాడతారు.
* రీఎంట్రీకి రెడీ..
ఈ పాన్ ఇండియా యుగంలో రెండు మూడు భాషల్లో పాపులారిటీ కలిగిన ఆర్టిస్టులకు దర్శకనిర్మాతలు పెద్ద పీట వేస్తున్న నేపథ్యంలో దివ్యవాణి (Actress Divya Vani) మళ్లీ సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

