Sai Pallavi Om Chapter 1
* నిత్యారెడ్డిగా సాయిపల్లవి పరిచయం..
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : హీరో ధనుష్ కథానాయకుడిగా.. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓం – చాప్టర్ 1: ఉధిరం – ది బ్లడ్ వుడ్’ నుంచి హీరోయిన్ సాయిపల్లవి (Sai Pallavi Om Chapter 1) క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో విడుదలైంది. ఈ సినిమాలో ఆమె నిత్యారెడ్డి అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.
* పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా..
పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆమె తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. సాయి పల్లవి పాత్ర విషయానికి వస్తే.. నిత్యారెడ్డి తెలివితేటలు, నిజాయతీ, అనుభవం ఉన్న యువ పోలీస్ ఆఫీసర్‌గా పరిచయమైంది. గతంలో సీబీఐ, ఇంటర్‌పోల్‌లో పనిచేసిన ఆమె.. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ ఓం’ను ఆమె లీడ్ చేస్తుంది. ఈ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోలో సాయిపల్లవి (Sai Pallavi Om Chapter 1) పవర్ఫుల్, ఇంటెన్స్ లుక్‌లో ఆకట్టుకున్నారు.
అధికారాన్ని ప్రతిబింబించే బాడీ లాంగ్వేజ్, లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో పాటు నిత్యారెడ్డి పాత్రలోని విభిన్న కోణాలను ఈ వీడియోలో చూపించారు. ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్‌పై శ్రద్ధా అగర్వాల్ నిర్మిస్తోన్న ఈ సినిమాను ధనుష్‌కు చెందిన వండర్‌బార్ ఫిల్మ్స్‌తో కలిసి రూపొందిస్తున్నారు.
రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ధనుష్, మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. కె. ఎళిల్ అరసు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, ఆర్. కళైవానన్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
ఎ. పన్నీర్‌సెల్వం ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. యానిక్ బెన్, కేచా ఖంపక్డీ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ అందించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

