Ritika Nayak Powerpeta First Look
* సందీప్ కిషన్ సరసన రితికా నాయక్..
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : ‘మిరాయ్’, ‘కొరియన్ కనకరాజు’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రితికా నాయక్.. ‘పవర్‌పేట’లో సందీప్ కిషన్ సరసన హీరోయిన్గా నటిస్తున్నారు. రితికా నాయక్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె పాత్రను పడమటవీధి జానకిగా పరిచయం చేశారు.
* పడమటవీధి జానకిగా అలరిస్తున్న ఫస్ట్ లుక్..
సంప్రదాయబద్ధమైన, అందమైన లుక్‌లో కనిపిస్తున్న రితికా నాయక్.. పాతకాలపు ఇంట్లో చెక్క బెంచీపై హుందాగా కూర్చుని ఆకట్టుకుంటున్నారు. క్రీమ్ కలర్ హాఫ్ సారీ, పీచ్ కలర్ దుపట్టా, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో పాటు సంప్రదాయ ఆభరణాలు, ఉంగరాల జుట్టు ఆమె లుక్కు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ప్రశాంతమైన హావభావాలతో పడమటవీధి జానకిగా రితికా ఆకట్టుకుంటున్నారు.
సందీప్ కిషన్ హీరోగా, కృష్ణ చైతన్య రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘పవర్‌పేట’. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నేతృత్వంలోని సక్సెస్ఫుల్ నిర్మాణ సంస్థ 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ప్రేమ, గౌరవం, రాజకీయాల కలయికగా ఈ కథ ఉండబోతోందనే ఆసక్తిని ఆ గ్లింప్స్ కలిగించింది.
దర్శకుడు కృష్ణ చైతన్య తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా ‘పవర్‌పేట’ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయింది. రితికా నాయక్ రాకతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
మధీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్. రామకృష్ణ, మోనికా ప్రొడక్షన్ డిజైన్‌ను చూసుకుంటుండగా, సచిన్ సుధాకరన్, హరిహరన్ సౌండ్ డిజైన్ గా వ్యవహరిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

