ప్రజా భవన్లో సీతక్కను కలిసిన షర్మిల దంపతులు
* కూతురు వివాహానికి రావాలని ఆహ్వానం
* వైఎస్సార్ జ్ఞాపకాలతో భావోద్వేగం
YS Sharmila| ఆకేరు న్యూస్, ములుగు: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Y S Sharmila) తన భర్తతో కలిసి బుధవారం ప్రజా భవన్లో తెలంగాణ మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరుకావాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.
ప్రజా భవన్కు విచ్చేసిన వైఎస్ షర్మిల దంపతులకు మంత్రి సీతక్క ఆత్మీయ స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి, వారితో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆత్మీయ పలకరింపులు చోటుచేసుకున్నాయి.
వైఎస్సార్ జ్ఞాపకాలతో భావోద్వేగం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో అనుబంధం ఉన్న ప్రజా భవన్లోని పలు ప్రాంతాలను షర్మిల సందర్శించారు. తన తండ్రితో గడిపిన రోజులను, పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ క్రమంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాన్ని చూసి ఆమె భావోద్వేగానికి గురయ్యారు. దీంతో మంత్రి సీతక్క (Minister Seethakka) ఆమెను ఆప్యాయంగా ఓదార్చారు.
ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి షర్మిల ఉన్న చిత్రపటాన్ని సీతక్క జ్ఞాపికగా అందజేశారు.
పలువురు ప్రముఖుల హాజరు
ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క తనయుడు సూర్య, ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

