అంబేద్కర్ విగ్రహం వద్ద మహాసభ పోస్టర్లను ఆవిష్కరణ
* నవంబర్ 22న వరంగల్లో మహాసభ
ఆకేరు న్యూస్, ములుగు: వరంగల్ జిల్లా కేంద్రంలో నవంబర్ 22న నిర్వహించనున్న స్వేరో ఆత్మీయ సమ్మేళనం మహాసభను విజయవంతం చేయాలని స్వేరో నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద మహాసభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల విద్య, ఉద్యోగ, సామాజిక అభ్యున్నతి కోసం స్వేరో ఉద్యమం కృషి చేస్తోందని తెలిపారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్ఫూర్తితో ఏర్పడిన స్వేరోస్ నెట్వర్క్ దేశవ్యాప్తంగా విస్తరిస్తోందని, విద్య ద్వారానే సామాజిక విముక్తి సాధ్యమనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందని పేర్కొన్నారు.
నవంబర్ 22న వరంగల్లో జరిగే స్వేరో ఆత్మీయ సమ్మేళనం మహాసభకు ఉమ్మడి వరంగల్ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది స్వేరోస్ హాజరుకావాలని కోరారు. ములుగు జిల్లా నుంచి విద్యార్థులు, యువకులు, మేధావులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం జిల్లా కన్వీనర్ వీరబోయిన రాజేందర్, కో-కన్వీనర్ బొట్ల ప్రశాంత్, సీనియర్ నాయకులు వావిలాల కిషోర్, స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు వావిలాల రవితేజ, ప్రధాన కార్యదర్శి గణేష్, నాయకులు శరత్, కుమార్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

