సర్పంచ్ లావణ్య మల్లారెడ్డి
* భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యం
* సర్పంచ్ లావణ్య మల్లారెడ్డి
Lavanya Mallareddy| ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: వర్షపు నీటిని వృథాగా పోనివ్వకుండా ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించాలని మల్కాపూర్ సర్పంచ్ ఎడవల్లి లావణ్య మల్లారెడ్డి అన్నారు.
జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఇంకుడు గుంత నిర్మాణ పనులను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. వర్షపు నీటిని సంరక్షించడం ద్వారా భూగర్భ జలమట్టాలను పెంచుకోవచ్చని తెలిపారు. ప్రతి చుక్క నీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో నీటి కొరతను తగ్గించవచ్చని పేర్కొన్నారు. గ్రామంలో నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పశుల వెంకటేశ్వర్లు, గ్రామ శాఖ అధ్యక్షుడు జంగం రవి, డైరెక్టర్ యశ్వంత్ రెడ్డి, వార్డు సభ్యులు హరీష్, రాకేష్, కుమారస్వామి, రాణి నాదము, కుమార్, రవి, మదిరెడ్డి మోహన్ రెడ్డి, పొన్న రాజయ్య, వెంకట్ రెడ్డి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

