Sardar Vallabhbhai Patel Jayanti
* కలెక్టర్ ఘన నివాళి
* ఏకత్వానికి ప్రతిరూపమే జాతీయ ఐక్యతా దినోత్సవం
ఆకేరు న్యూస్, హనుమకొండ : దేశ ప్రజలందరి ఐక్యతకు, సమైక్యతకు ప్రతిరూపమే జాతీయ ఐక్యతా దినోత్సవమని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ తొలి ఉప ప్రధానమంత్రి, ఉక్కు మనిషి, స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అదనపు కలెక్టర్ ఎన్. రవి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
* దేశ సమగ్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ ఐక్యత, సమైక్యత, సమగ్రతను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. జాతీయ ఐక్యతా స్ఫూర్తిని పెంపొందించుకుంటూ దేశ భద్రత, సమగ్రతను కాపాడటంలో పౌరులందరూ భాగస్వాములు కావాలని అన్నారు. అనంతరం రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా అధికారులు, ఉద్యోగులతో కలిసి జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు. దేశ సమైక్యత, సమగ్రత, భద్రతను కాపాడేందుకు అంకితభావంతో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, కలెక్టరేట్ పరిపాలనాధికారి గౌరీ శంకర్, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

