Warangal Police Commissioner N. Swetha participated in the Ekta Run
* సర్దార్ పటేల్‌కు ఘన నివాళి
* జాతీయ ఐక్యతా స్ఫూర్తితో ఏక్తా రన్..
ఆకేరు న్యూస్, హనుమకొండ : ఉక్కు మనిషి, భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏక్తా రన్ ఉత్సాహభరితంగా సాగింది. శనివారం హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి ప్రారంభమైన ఈ పరుగులో విద్యార్థులు, వాకర్స్, ఎన్సీసీ క్యాడెట్లు, పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏజే పెడల్స్ ఈ కార్యక్రమానికి సహకారం అందించింది. వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఏక్తా రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె కూడా పరుగు కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు, యువత, ఇతర పాల్గొనేవారిని ప్రోత్సహించారు.
* 5కే, 10కే పరుగులతో సందడి
హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి ప్రారంభమైన 5, 10 కిలోమీటర్ల ఏక్తా రన్ వరంగల్‌లోని గోపాలస్వామి ఆలయం వరకు కొనసాగింది. అక్కడి నుంచి తిరిగి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకోవడంతో పరుగు కార్యక్రమం ముగిసింది. ట్రైసిటీ పరిధిలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, ఎన్సీసీ క్యాడెట్లు, ఏజే పెడల్స్ ప్రతినిధులు, పోలీసు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
* జాతీయ ఐక్యతకు ప్రతీక సర్దార్ పటేల్
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఏక్తా రన్ జాతీయ ఐక్యత, సమగ్రత పట్ల ప్రజల్లో స్ఫూర్తిని నింపుతుందని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, శారీరక దృఢత్వంపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన అపారమైన సేవలను స్మరించుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
* విజేతలకు బహుమతుల ప్రదానం
అనంతరం వివిధ విభాగాల్లో నిర్వహించిన పరుగుపోటీల్లో ప్రతిభ కనబరిచిన ముగ్గురు చొప్పున విజేతలను ఎంపిక చేసి పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత బహుమతులు ప్రదానం చేశారు. జాతీయ ఐక్యతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ఐక్యత, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.
* పలువురు పోలీసు, మున్సిపల్ అధికారులు హాజరు
ఈ కార్యక్రమంలో వరంగల్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, అడిషనల్ డీసీపీ (పరిపాలన) రాయల ప్రభాకర్ రావు, కమిషనరేట్ పరిధిలోని ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, ఏఆర్ విభాగానికి చెందిన అడిషనల్ డీసీపీలు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

