The accused in the Rapthadu school attack sustained serious leg injuries in police firing
* రెండు కాళ్లలోకి దూసుకెళ్లిన ఆరు బుల్లెట్లు..
* కుడి కాలులో ఇంకా మూడు బుల్లెట్లు..
* తీవ్ర రక్తస్రావంతో నాలుగు యూనిట్ల రక్తం ఎక్కింపు
ఆకేరు న్యూస్, డెస్క్ : రాప్తాడు పాఠశాలలో బాలికపై రంపంతో దాడి చేసిన నిందితుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులపై దాడికి యత్నించిన క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడి రెండు కాళ్లకు బుల్లెట్ గాయాలైనట్లు సమాచారం. రెండు మోకాళ్ల కింది భాగాల్లోకి మొత్తం ఆరు బుల్లెట్లు దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. కుడి కాలులో ఇంకా మూడు బుల్లెట్లు ఉన్నట్లు సమాచారం.
* కాళ్లు తొలగించే అవకాశం..
నిందితుడికి తీవ్ర రక్తస్రావం కావడంతో వైద్యులు ఇప్పటికే నాలుగు యూనిట్ల రక్తం ఎక్కించారు. కాసేపట్లో వైద్యులు ఆపరేషన్ చేయనున్నట్లు తెలుస్తోంది. గాయాల తీవ్రత దృష్ట్యా నిందితుడి కాళ్లను తొలగించే అవకాశం ఉందని సమాచారం.
ఇటీవల రాప్తాడు పాఠశాలలో పదో తరగతి బాలికపై రంపంతో దాడి చేసిన నిందితుడు అనంతరం ఆత్మకూరు అటవీ ప్రాంతంలోకి పారిపోయాడు. అతడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడికి యత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం.
మరోవైపు, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని గోపిక బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు సమాచారం.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

