Telangana Judicial Officers Retirement Age
* పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 61 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం–1984కు సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, తెలంగాణ హైకోర్టు సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సవరణను 2026 మార్చి 31 నుంచి పూర్వప్రభావంతో అమల్లోకి తీసుకొచ్చారు.
* ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారికీ అవకాశం..
ఈ నిర్ణయం ప్రకారం 2026 మార్చి 31 నుంచి పదవీ విరమణ చేసిన అర్హులైన న్యాయాధికారులకు తిరిగి విధుల్లో చేరే అవకాశం కల్పించారు. పదవీ విరమణ వయసు పెంపుతో అర్హులైన న్యాయాధికారులు మరో ఏడాది పాటు సేవలు అందించేందుకు వీలు కలగనుంది. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం–1984లో చేసిన సవరణ ద్వారా న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచారు. ఈ మార్పు అమలుకు సంబంధించి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

